చరణ్ కన్నేశాడు సురేష్ బాబు కొనేశాడుAsuran movie.jpg
2019-10-25 06:49:06

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన రా రస్టిక్‌ మూవీ అసురన్‌. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెట్రీమారన్‌ దర్శకుడు. ధనుష్‌ డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి ధనుష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో ధనుష్‌ నటన, వెట్రిమారన్‌ టేకింగ్‌కు అవార్డులు రివార్డులు ఖాయమన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే ఈ మధ్య రీమేక్స్ ఎక్కువవడంతో, ఒక భాషలో ఏదైన సినిమా సూపర్‌ హిట్ అయితే వెంటనే ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కొంచెం కొత్తదనంతో కూడిన సినిమాలని రీమేక్ చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇప్పుడు తాజాగా అసురన్‌ విషయంలోనే అదే జరుగుతోంది. ఈ సినిమా మీద చరణ్ ద్రుష్టి పడిందని ఈ సినిమా హక్కులు కొంటున్నాడని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాని వెంకటేష్ కోసం కొనేసింది సురేష్ ప్రొడక్షన్ సంస్థ. ఈ విష‌యాన్ని సురేష్ ప్రొడ‌క్షన్స్ సంస్థ ప్రక‌టించింది. క‌లైపులి ఎస్‌.థానుతో క‌ల‌సి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం వెంక‌టేష్ ‘వెంకీ మామ‌’ సినిమాలో  న‌టిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన త‌ర‌వాత‌ ఈ రీమేక్ ప‌ట్టాలెక్కబోతోందని అంటున్నారు. అయితే దర్శకుడు మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

More Related Stories