అభిమాని పెళ్లిలో సూర్య సందడి..ఫొటోస్ వైరల్



Suriya
2021-01-25 17:02:08

తమిళ స్టార్ హీరో సూర్య కి అభిమానులంటే ఎంతో ప్రేమ. సినిమా కార్యక్రమాలలో ఆయన ఇప్పుడు పాల్గొన్నా తనకు ఇలాంటి అభిమానులు ఉండటం అదృష్ట్రం అని చెప్పుకుంటారు. అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతుంటారు. అయితే తాజాగా సూర్య ఏకంగా తన అభిమాని పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేసాడు. అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. పెళ్లికి ఒక స్టార్ హీరో రావడంతో పెళ్లి సందడి రెండితలయ్యింది. సూర్య పెళ్లికి వెళ్లిన ఆ అభిమాని ఎవరంటే "ఆలిండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్" సభ్యుడు హరి. అతడి పెళ్ళికొసం సూర్య తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మరీ పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో మండపంలో నిలుచుని పెళ్లికొడుకుకు తాళి బొట్టు సైతం తన చేతుల మీదుగా అందించాడు. అనంతరం వధూవరులిద్దరిని దీవించాడు. ఇదిలా ఉండగా సూర్య నటించిన "ఆకాశమే నీ హద్దురా" సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సాధారణ ప్రజలే కాకుండా స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. సినిమా లో సూర్య నటనను పొగుడుతూ ట్వీట్స్ కూడా చేసారు. ఈ సినిమాకు సుధా కొంకర దర్శకత్వం వహించారు.
 

More Related Stories