70 కోట్ల అప్పులున్నాయి.. మీరొచ్చి తీరుస్తారా అంటున్న సూర్య..Suriya
2020-05-18 23:48:56

ఈ మధ్య తమిళ హీరో సూర్య బాగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన తీసుకున్న నిర్ణయాలు అలా ఉన్నాయి మరి. తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య తన 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన పొన్ మగల్ వందాన్ సినిమాను నేరుగా మే 29న అమెజాన్ లో విడుదల చేస్తున్నాడు సూర్య. దీనిపై తమిళనాడు థియేటర్స్ సంఘం సీరియస్ అయింది. పరిస్థితులు ఇలా ఉన్నాయని ఓటిటిలో విడుదల చేస్తే తర్వాత మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు కూడా థియేటర్స్ లో విడుదల చేయమని వార్నింగ్ ఇచ్చారు. దానికి కూడా సూర్య బెదరలేదు. తన నిర్ణయం వెనక్కి తీసుకోలేదు. కరోనా క్రైసిస్ లో ఇప్పుడు కొందరు నిర్మాతలకు డైరెక్ట్ థియేటర్ రిలీజ్ అనేది కలగా మారిపోతుంది. అలాగని చేసిన సినిమాలు అలాగే పెట్టుకోలేరు.. అందుకే ఓటీటీ వేదికల్లో విడుదల చేస్తున్నారు. సూర్య కూడా ఇలానే చేయడానికి సిద్ధమయ్యాడు. దీనిపై ఇప్పుడు సూర్య క్లారిటీ ఇచ్చాడు. 

తనకు 70 కోట్లు అప్పు ఉందని.. సినిమాను రిలీజ్ చేసుకోకుండా ఇంకేం చేయాలని ప్రశ్నించాడు. మీరు అయితే వచ్చి తన అప్పులు తీర్చలేరు కదా అంటూ సీరియస్ అవుతున్నాడు సూర్య. తన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎవరైనా సాయపడ్డారా.. లేదంటే తన బిజినెస్ పడిపోయినపుడు వచ్చి అండగా నిలబడ్డారా.. తన బిజినెస్ తాను చేసుకుంటున్నానని చెప్పాడు సూర్య. సినిమా హిట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో కూడా ఎగ్గొట్టే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తనను ప్రశ్నించడం కామెడీగా ఉందని సీరియస్ అయ్యాడు ఈయన. తాను నిర్మించే ఇకపై ఓటీటీలోనే రిలీజ్ చేస్తానని.. వాటికి తగ్గట్టుగానే తన సినిమాల బడ్జెట్ ఉంటుందని తేల్చేసాడు సూర్య. 

డబ్బు ఖర్చు పెట్టే నిర్మాతకు తెలుస్తుంది ఆ కష్టం.. పెట్టుబడిని రాబట్టుకోవడానికి మార్గాలు వెతుక్కోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నాడు సూర్య. గట్టున కూర్చున్న వాడు ఎన్నైనా మాట్లాడతాడు.. ఉచిత సలహాలు ఇస్తాడు.. కానీ ఈదుతున్న వాడికి తెలుస్తుంది ఆ బాధ అంటున్నాడు సూర్య. నిర్మాతల డబ్బులకు వాళ్లేమైనా హామీ ఇస్తున్నారా.. అలాంటప్పుడు సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు సూర్య. ప్రస్తుతం ఈయన మాటలు సంచలనం అవుతున్నాయి. ఇంకొందరు చిన్న నిర్మాతలకు ఊతం ఇస్తున్నాయి. ఏదేమైనా కూడా తమ వెనక సూర్య ఉన్నాడనే ధైర్యంతో వాళ్లు ముందడుగు వేస్తున్నారు. 

More Related Stories