సూర్య, హరి ఒన్స్ మోర్.. కానీ ఈ సారి కాస్త కొత్తగా..hari
2019-10-24 06:34:46

అనుకున్న‌దే జ‌రిగింది. మరోసారి సూర్య, హరి కాంబినేషన్ వర్కవుట్ అయింది. పోలీస్ క‌థ‌లు రాసి రాసి అన్నీ ఒకేలా తీయ‌డం అల‌వాటు చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రి. కానీ ఎన్ని చేసినా మ‌ళ్లీ ఈయ‌న సినిమాల్లో స్క్రీన్ ప్లే మాయ న‌డుస్తుంది. అయితే సామి 2, సింగం 3 విషయంలో అది జరగలేదు. ఈ రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు సూర్యతో కొత్త సినిమా చేయాలని చూస్తున్నాడు. పోలీస్ స్టోరీ కాకుండా.. సింగం సిరీస్ కాకుండా మరో కొత్త కథతో రాబోతున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే కథ కూడా లాక్ అయిపోయింది.

వేల్, ఆరు లాంటి మాస్ సినిమాతో ఈ సారి ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు దర్శకుడు హరి. నిజానికి విక్రమ్ తో చేసిన సామి 2 కథ సూర్య కోసం రాసుకున్నదే. కానీ సింగం 3 ఫ్లాప్ కావ‌డంతోనే సామి 2 అంటూ విక్ర‌మ్ తో తీసాడు హ‌రి. ఇక ఇప్పుడు సూర్య కోసం కొత్త కథ సిద్ధం చేసుకుని త్వరలోనే సెట్స్ పైకి వెళ్తానంటున్నాడు హరి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది. మొత్తానికి వరస పరాజయాలతో ఉన్న సూర్య, హరి ఈ చిత్రంతో ఎలాంటి మాయ చేయబోతున్నారో చూడాలిక.

More Related Stories