మాజీ మేనేజర్ మరణానికి, సుశాంత్ ఆత్మహత్యకు ఏదైనా లింకు ఉందా..  Sushant Singh
2020-06-15 09:12:27

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అభిమానులు కలిచి వేస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా ఉన్నపళంగా అర్ధాంతరంగా ఉరివేసుకొని చనిపోవడం అనేది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి కారణం కేవలం డిప్రెషన్ మాత్రమేనా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో గమనించదగ్గ విషయం ఏంటంటే సుశాంత్ ఆత్మహత్యకు సరిగ్గా 5 రోజుల ముందు ఆయన దగ్గర పనిచేసిన ఒక మాజీ మేనేజర్ కూడా ఇలాగే సూసైడ్ చేసుకుంది. కొన్నేళ్ళ పాటు ఆయన దగ్గర మేనేజర్ గా పని చేసి మానేసిన దిశ ముంబైలోని తన అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

ఐశ్వర్య రాయ్, వరుణ్ శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి స్టార్స్ దగ్గర ఈమె మేనేజర్ గా పని చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న 5 రోజుల వ్యవధిలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారుతుంది. ఈ రెండు మరణాలకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అందిస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన చనిపోయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయన స్నేహితులు బంధువులు కూడా సుశాంత్ మరణంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. దాంతో కేవలం డిప్రెషన్ కారణంగానే ఆయన చనిపోయి ఉంటాడని నిర్ధారించుకున్నారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. 
 

More Related Stories