సుశాంత్ కేసును సీబీఐకి...బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయంSushant Singh Rajput
2020-08-04 22:56:20

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. సుశాంత్ తండ్రి రియా చక్రవర్తి పై ఫిర్యాదు చేయడం..రియా చక్రవర్తి తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం.. ఇక ఈ కేసుని దర్యాప్తు చేస్తూ వస్తున్న ముంబై పోలీసులు.. బీహార్ పోలీసులకు సహకరించకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసి తన కుమారుడి కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. అంతేకాకుండా సుశాంత్ ది సూసైడ్ కాదని హత్య అని.. కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని డిమాండ్ చేసారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ డిమాండ్ కి మద్ధతు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసుని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.దీంతో సూసైడ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

More Related Stories