సుశాంత్ కేసులో మొట్టమొదటిసారిగా నోరు విప్పిన రియా Sushant Singh Rajput
2020-08-28 11:49:52

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు అనేక ట్విస్టులు ఉన్నాయి. సుశాంత్ కుటుంబ సభ్యులంతా రియావైపు వేలెత్తి చూపిస్తుండగా.. రియా మాత్రం, సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ను తప్పుబడుతోంది. బాలీవుడ్ లో నెపోటిజం నుంచి సుశాంత్ డిప్రెషన్ వరకు అనేక అంశాల మీద ఎట్టకేలకి నిన్న మొట్టమొదటిసారిగా క్లారిటీ ఇచ్చింది రియా. సుశాంత్ చనిపోయిన జూన్ 14 నుంచి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయని రియా మొట్టమొదటిసారిగా ఓపెన్ అప్ అయ్యారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడే మాట్లాడటానికి అనేక కారణాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసు, సుశాంత్ మరణానికి ఆమె ప్రధాన నిందితురాలు అని అన్నివైపుల నుంచి ఆరోపణలు చుట్టుముట్టడంతో రియా మీడియా ముందుకు రాక తప్ప లేదు. 2013లో జిమ్‌లో మొదటిసారి తాము కలుసుకున్నామన్న ఆమె 2015లో రోహిణి అయ్యర్ ఇచ్చిన ఓ పార్టీలో సుశాంత్ తనకు ప్రపోజ్ చేశాడని కేవలం ఒక్కరోజులోనే తనతో ప్రేమలో పడ్డట్టు చెప్పాడని అన్నారు. కానీ తనకు కొద్దిరోజులు టైమ్ కావాలని కోరానని అయితే ఆరోజు సుశాంత్ చెప్పిన ఆ ఐలవ్యూ ఈ రోజు తనను ఈ స్థితికి తీసుకొస్తుందని ఊహించలేదన్నారు.

సుశాంత్ డిప్రెషన్ తో బాధపడేవాడని.. అతని తల్లికి కూడా ఇలాంటి సమస్య ఉండేదన్నారు. తాను అనేకసార్లు సుశాంత్‌ను డాక్టర్ల వద్దకు తీసుకెళ్లినట్లు వివరించింది రియా. సుశాంత్ కుటుంబసభ్యులతో తన రిలేషన్ బాగుండేది కాదని చెప్పింది రియా. ఒకసారి సుశాంత్ సోదరి ప్రియాంకతో గొడవ జరిగిందని.. ఆమె మద్యం మత్తులో తనతో మిస్ బిహేవ్ చేసిందని ఆమె ఆరోపించింది. సుశాంత్ కుటుంబసభ్యులతో తనకు సమస్యలు ఉన్నా.. అతని మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాను సర్దుకుపోయానని రియా చెప్పింది. అయితే సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు వాళ్లు.. అతడిని ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్లారని ప్రశ్నించింది. రియా చెబుతున్నవి అన్నీ నిజాలేనా ? లేక తనని కార్నర్ చేస్తున్నారని కొత్త డ్రామాకు  తెరలేపిందా ? అనేది తెలియాల్సి ఉంది. 

More Related Stories