సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుంచి చేజారిన 9 సినిమాలు ఇవే..Sushant Singh Rajput
2020-06-20 07:46:44

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కెరీర్‌తో మొదట్నుంచి కూడా ఆడుకున్నారు బాలీవుడ్ బిగ్గీస్. కావాలనే తనను ఓ సినిమాకు సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పిన తర్వాత తీసేయడం లాంటివి చేసారు. అందులో మరీ ముఖ్యంగా యశ్ రాజ్ ఫిల్మ్, ధర్మా ప్రొడక్షన్స్, మహేష్ భట్, భన్సాలీ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ముందుగా సుశాంత్‌ను ఒప్పించిన తర్వాత మరొకరితో ఆ సినిమాలు చేసారు. అలా ఆయన చేజారిన 9 సినిమాలు ఇవే.

ఆషికి 2: ఆదిత్యరాయ్ కపూర్‌ను హీరోగా నిలబెట్టిన సినిమా ఆషికి 2. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా వచ్చిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ను మోహిత్ సూరి తెరకెక్కించాడు. ముందుగా ఈ చిత్రంలో సుశాంత్‌ను అనుకున్న తర్వాత చివరి నిమిషంలో ఆదిత్యను తీసుకున్నారు.

రామ్ లీలా: సుశాంత్ శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమా చేస్తున్నపుడే భన్సాలీ తన సినిమా రామ్ లీలాలో హీరోగా సుశాంత్ సింగ్‌ను అనుకున్నాడు. అదే విషయం చెప్పగానే ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం రణ్‌వీర్ సింగ్ సీన్‌లోకి వచ్చాడు.

బాజీరావ్ మస్తానీ: రామ్ లీలా సినిమా విషయంలో జరిగినట్లే బాజీరావ్ మస్తానీ సమయంలో కూడా జరిగింది. ఈ చిత్రానికి కూడా సుశాంత్‌ను నమ్మించి మోసం చేసారు.
ఫితూర్: ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా వచ్చిన అభిషేక్ కపూర్ తెరకెక్కించిన ఫితూర్ సినిమాకు ముందు సుశాంత్‌నే అనుకున్నాడు. సుశాంత్ తొలి సినిమా కై పో చే దర్శకుడు కూడా ఈయనే. అయితే డేట్స్ కుదరక ఈ చిత్రం ఆదిత్యకు వెళ్లిపోయింది.

బేఫికరే: ఆదిత్య చోప్రా బేఫికరే విషయంలో సుశాంత్‌ను దారుణంగా మోసం చేసాడు. ఈ సినిమాను నీతోనే చేస్తానంటూ చెప్పి చివరి నిమిషంలో మాట మార్చేసి రణ్‌వీర్ సింగ్‌ను తీసుకున్నాడు.

హాఫ్ గాళ్ ఫ్రెండ్: చేతన్ భగత్ నవల ఆధారంగా వచ్చిన హాఫ్ గాళ్‌ఫ్రెండ్ సినిమాను కూడా ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తోనే తీయాలని ప్లాన్ చేసిన దర్శక నిర్మాతలు.. చివరికి ఆయన్ని కాదని మరో స్టార్ కిడ్ అర్జున్ కపూర్‌ను తీసుకున్నారు.

రా (RAW): జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన రోమియో అక్బర్ వాల్టర్ సినిమాకు డేట్స్ కూడా ఇచ్చాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కానీ చివరి నిమిషంలో డేట్స్ క్లాష్ రావడంతో తప్పుకోక తప్పలేదు.

సడక్ 2: ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సంజయ్ దత్, అలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్ సడక్ 2 సినిమాలో కూడా ముందు సుశాంత్‌ను హీరోగా అనుకున్నా కూడా చివరి నిమిషంలో గేమ్స్ ప్లే చేసి ఆయన్ని తప్పించేసారనే ప్రచారం ఉంది బాలీవుడ్‌లో.

రాకేష్ శర్మ: చివరగా వ్యోమగామి రాకేష్ శర్మ బయోపిక్‌లో నటించాలని సుశాంత్ సింగ్‌కు కోరిక ఉండేది. పైగా స్పేస్ గురించి ఈయనకు అభిరుచి కూడా ఎక్కువే. అందుకే ముందుగా సుశాంత్ పేరు కూడా వినిపించింది. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్ వచ్చాడు.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ 9 సినిమాలు కానీ సుశాంత్ చేసి ఉంటే ఈ రోజు మన మధ్యే ఉండేవాడు. అందులోంచి ఆయన్ని తప్పించారు కాబట్టే ఈయన లోకం నుంచే తప్పుకున్నాడని అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. 

More Related Stories