మరో పెళ్లి చేసుకోబోతున్న శ్వేతాబసు ప్రసాద్..swetha
2020-04-25 07:21:14

కొత్త బంగారు లోకం సినిమాలో ఎకాడ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేతాబసు ప్రసాద్. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయినా కూడా ఈమె కెరీర్ మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ఎందుకో తెలియదు కానీ తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు అస్సలు యూజ్ చేసుకోలేకపోయింది శ్వేతా బసు. దానికి తోడు కొన్ని రోజుల తర్వాత ఓ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో ఈమె దొరికిపోవడం కూడా ఆమె కెరీర్ పై దారుణమైన ప్రభావం చూపించింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఈమె వైపు ఏ దర్శకనిర్మాత కన్నెత్తి చూడలేదు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ వెళ్లి అక్కడ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుంది. ఏడాది పాటు వీళ్ళ కాపురం బాగానే సాగినా గత డిసెంబర్ లో విడాకులు తీసుకుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత మెంటల్ గా కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది శ్వేతా బసు ప్రసాద్. దాంతో మానసిక వైద్యుడి నిర్వహణలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఏమి పరిస్థితిని చూసి భయపడిన తల్లిదండ్రులు వెంటనే మరో పెళ్లి చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటంతో ఇది అయిపోయిన తర్వాత రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తోంది శ్వేతా బసు ప్రసాద్.

More Related Stories