గడ్డి పరక కూడా గడ్డ దాట కూడదంటున్న చిరంజీవి



Sye Raa
2019-09-26 11:04:13

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కిక్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. చిరంజీవు కుమారుడు రామ్ చరణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మొత్తం నాలుగు దక్షిణాది బాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి రెండో ట్రైలర్ విడుదలయ్యింది. ఇటివలే రిలీజ్ అయిన మొదటి ట్రైలర్ అంచనాలకి తగ్గట్లుగానే భారీ విజువల్స్ తో బాగా ఆకట్టుకుంది. 

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన స్క్రీన్ ప్రేజన్స్ తో ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. అలాగే డైలాగ్ లతో పాటు నటీనటులు గెటప్స్ వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. ఇప్పుడు రెండో ట్రైలర్ కూడా సినిమా మీద మరింత అంచనాలు పెంచే విధంగా ఉంది. రెండో ట్రైలర్‌ను ‘సైరా నరసింహారెడ్డి-ది బ్యాటిల్ ఫీల్డ్’ పేరుతో యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాలో కీలక యుద్ధ సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. 

ఇండియాలో పన్నులు ౩౦౦ శాతం పెంచమని బ్రిటిషర్ లు అంటుంటే గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు చంపడం చావడం ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం అన్న చిరంజీవి డైలాగులు సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో చిరంజీవితో పాటుగా విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అమితాబ్ పాత్రలను కూడా ప్రధానం చూపించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తుండడంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెండో ట్రైలర్ మీరు కూడా చూసేయ్యండి మరి.

More Related Stories