సైరా కలెక్షన్స్...సోషల్ మీడియాలో రచ్చ sye raa
2019-10-12 11:47:48

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ బజ్ తో పాటు మంచి మౌత్ టాక్ రాగా రివ్యూస్ కూడా బాగనే వచ్చాయి. అయితే కలెక్షన్స్ ట్రెండ్ చూస్తే మాత్రం అదేమీ అంత ఈజీ పార్ట్ అనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా తెలుగు తప్ప మిగతా అన్నీ వెర్షన్లు డిజాస్టర్లుగా మిగిలాయి.  తెలుగులో కొంచెం పర్లేదు అనిపిస్తోంది. అయితే సైరా టీమ్ మాత్రం తమ సినిమా కలెక్షన్స్ ప్రకటించబోవడంలేదని ముందు చెప్పినట్టుగానే ఎటువంటి కలెక్షన్స్ అధికారికంగా వెల్లడించలేదు. 

అయితే ఒక వర్గ మీడియాలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ ను ఎక్కువ చేసి చెప్తున్నారని తద్వారా సినిమాను బ్లాక్ బస్టర్ అనిపించి పక్కకు తప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఆరిపిస్తున్నారు యాంటి ఫ్యాన్స్. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ జెన్యూన్ కలెక్షన్స్ అని మెగాస్టార్ స్టామినా మరోసారి చూపించారని మురిసిపోతున్నారు. ఈ క్రమంలో 'సైరా ఫేక్ కలెక్షన్స్'  అంటూ ఒక హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ టాగ్ కింద కొన్ని పోస్టులలో కొన్ని బుక్ మై షో ఎడ్వాన్స్ బుకింగులలో ఖాళీగా ఉన్న సీట్ల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మరి కొందరేమో గ్రాస్ కలెక్షన్లను షేర్ గా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగానే మండిపడుతున్నారు. అలా సైరా ఫేక్ కలెక్షన్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  

More Related Stories