శతక్కోట్టిన సైరా...దుమ్మురేపుతున్న నాలుగు రోజుల కలెక్షన్స్Sye Raa Narasimha Reddy
2019-10-06 12:00:19

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. సుమారు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం  అక్టోబర్ 2న  విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది.  ఈ సినిమా తొలి రోజే 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసింది. దసరా సెలవులు కావటంతో తరువాత కూడా కలెక్షన్లు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. 

నాలుగో రోజుకు ఈ సినిమా వంద కోట్ల షేర్‌ సాధించి సత్తా చాటింది. నిన్న నాలుగో రోజు కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. నాలుగో రోజు సైరా దాదాపు 14 కోట్ల షేర్‌ రాబట్టినట్టుగా ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ గట్టిగా వచ్చాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే శనివారం 7 కోట్ల వరకు షేర్‌ వచ్చినట్టుగా అంచనా. అంతేకాక కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే బాలీవుడ్‌లో మాత్రం సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో పర్ఫామ్‌ చేయలేకపోతోంది. మొదటి రోజు వసూళ్లతో పరవాలేదనిపించినా రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా తగ్గాయి. 

More Related Stories