ఐదో రోజూ సైరా ప్రభంజనం...ఫైవ్ డేస్ కలెక్షన్స్ Sye Raa Narasimha Reddy
2019-10-07 10:08:59

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యి ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న తెచ్చుకుంది. అటు విమర్శకులు ఇటు ప్రేక్షకులే కాక క్రిటిక్స్ కూడా మంచి రేటింగ్లు ఇచ్చేశారు. ఇవన్నీ చూశాక సైరా బాక్సాఫీస్ వద్ద సైరా దూసుకుపోతుందని మరో బాహుబలి అవుతుందని భావించారు. అందుకు తగ్గట్టు తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడంతో పాటు మిగిలిన భాషల నటీనటులు కూడా సినిమాలో ఉండటంతో సైరా ఆయా భాషలలో కూడా దూసుకుపోతుంద‌న్న అంచనాలు గట్టిగా వినవచ్చాయి. కానీ అందుకు వాస్తవ పరిస్థితులకి చాలా తేడా వచ్చేసింది. 4 రోజుల్లో 87 కోట్లకు పైగా వసూళ్ళని సాధించగా సినిమా నాలుగు రోజుల తర్వాత 5 వ రోజుకూడా మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, 

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు మంచి కలెక్షన్స్ ని సాదించింది. బతుకమ్మ పండగ వలన ఈవినింగ్ షోలకు నైజాం లో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, అది తప్పితే 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ జాతరని తలపించేలా సైరా నరసింహా రెడ్డి జోరు కొనసాగుతుండటం తో రోజు ముగిసే సరికి సినిమా 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత ఓవర్సీస్ లో జోరు చూపిన సైరా 5 వ రోజు కలెక్షన్స్ తో 2 మిలియన్ మార్క్ ని అధిగమించింది'. బ్రేక్ ఈవెన్ కి ఇంకా కష్టపడాల్సి ఉంది. ఇక ఈ సినిమా కన్నడలో కూడా జోరు చూపగా హిందీ, తమిళ్, మలయాళ మార్కెట్ లో భారీగా పడిపోయింది.  

More Related Stories