రామ్ చరణ్ ముందు ఓడిపోయిన మెగాస్టార్ చిరంజీవి.. Sye Raa Narasimha Reddy
2019-10-24 12:20:38

అవును.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు తనయుడి చేతుల్లో ఓడిపోయాడు చిరంజీవి. ఈయన నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా 140 కోట్లకు పైగా వసూలు చేసినా కూడా చాలా చోట్ల ఇంకా సేఫ్ జోన్ కు అయితే రాలేదు. ముఖ్యంగా నైజాం, ఉత్తరాంధ్ర మినహాయిస్తే తెలుగులో కూడా ఎక్కడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు. భారీ రేట్లకు అమ్మడమే సైరాకు వచ్చిన అసలు మైనస్. ఇక ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తుంటే ఈ చిత్రం రంగస్థలంను కూడా కొన్ని ఏరియాల్లో దాటలేదు. ఇది నిజంగానే విడ్డూరంగా అనిపిస్తుంది. చిరంజీవి లాంటి మెగాస్టార్.. సైరా లాంటి భారీ సినిమా చేసినపుడు కూడా రికార్డులు రాకపోవడం అనేది కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. బాహుబలి ఎలాగూ ముందుంది కానీ రంగస్థలం రికార్డులను కూడా చిరు టచ్ చేయలేకపోవడం విచిత్రమే. ఏదేమైనా తనయుడి చేతుల్లోనే ఓడిపోతున్నాడు కాబట్టి పెద్దగా బాధేమీ ఉండదు. రంగస్థలం ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో 3.5 మిలియన్ క్రాస్ చేసింది. కానీ సైరా మాత్రం 2.5 మిలియన్ తోనే ఆగిపోయింది. ఏపీ, తెలంగాణల్లో కూడా కొన్ని ఏరియాల్లో సైరా కంటే రంగస్థలం చాలా ముందున్నాడు. 

More Related Stories