సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి !syeraa
2019-09-22 19:26:19

 

చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమాని రామ్‌ చరణ్‌ నిర్మించారు. తెలుగు తోలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం కావడం, ఆయన జీవిత చరిత్ర మీద తెలుగు వారికి కూడా సరయిన అవగాహన లేకపోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో పాటు ఈ సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక ఈరోజు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది.

ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది శ్రేయాస్ మీడియా సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున పాస్ లు కూడా పంచి పెట్టారు. ఇక ఈ వేడుకను మీరు మా ఫేస్ బుక్ పేజ్ లైవ్ ద్వారా వీక్షించవచ్చు. మీరు లైవ్ చూడాలంటే సినిమా పాలిటిక్స్ డాట్ కామ్ కు ట్యూన్ అయి ఉండండి ఫేస్బుక్లో సైరా లైవ్ ఈవెంట్  వీక్షించండి. ఇక ఈ సినిమా భారీ ఎత్తున తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబరు 2న ‘సైరా’ చిత్రం విడుదల కానుంది.

More Related Stories