కర్నూల్ లో భారీగా సైరా వేడుక Sye Raa
2019-09-05 12:48:07

మొదటి తరం తెలుగు స్వతంత్ర సమరయోథుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డిగా నటించిన ఈ సినిమాకి  ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్లో తెర‌కెక్కిన‌ సినిమాని ఏకంగా రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టారు. విడుద‌ల‌కు ఇంకో నెల రోజులు కూడా స‌మ‌యం లేని నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ల జోరు పెంచే పనిలో పడింది యూనిట్. 

ఎటూ సాహో మానియా చల్లబడ్డట్టే అని భావిస్తున్న యూనిట్ ఇప్పటి నుండే సినిమాని జనాల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తోంది.  ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌ల అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుక‌ను కర్నూల లో చేయాలని యూనిట్ భావిస్తోందట.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ జిల్లాకి చెందినా వాడు కావడంతో ఈ ఆడియో ఫంక్షన్ ను కర్నూల్ లో నిర్వహించనున్నారని అంటున్నారు. సీమలో చిరు కున్న అభిమానుల రీత్యా ఈ వేడుకకి లక్ష మంది దాకా వస్తారని భావిస్తున్నారు. ఇక ఆ ఆడియో ఫంక్షన్ ఈ నెల 29న ఉండచ్చని అంటున్నారు. 

More Related Stories