సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసాsyeraa
2019-09-16 19:30:59

చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి. ధృవ సినిమా తర్వాత మూడేళ్ల పాటు కష్టపడి సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు 250 కోట్లతో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ ఎంటర్ టైనర్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల ఇండస్ట్రీల్లో కూడా విడుదల కానుంది. సైరా నరసింహారెడ్డి టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తుంది. ఇక మేకింగ్ వీడియో కూడా రప్ఫాడిస్తుంది. ట్రైలర్ కూడా మరో రెండు రోజుల్లోనే రానుంది. సెప్టెంబర్ 18న ట్రైలర్ లాంఛ్ వేడుక జరగనుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, రవికిషన్ లాంటి స్టార్స్ అంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతీ ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ ను తీసుకొచ్చాడు రామ్ చరణ్. దాంతో అన్ని ఇండస్ట్రీలలో కూడా సైరాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక గురించి చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 22న సైరా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అది కూడా హైదరాబాద్ లోనే చేయబోతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటులంతా రానున్నారు. దాంతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు చాలా మంది వస్తున్నట్లు తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్ మాత్రం వస్తారా రారా అనే దానిపై కాస్త కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది.

More Related Stories