సైరా నరసింహారెడ్డి ఈవెంట్స్ షెడ్యూల్స్ ఖరారు.. Sye Raa Pre release
2019-09-26 12:59:03

చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇండియన్ వైడ్ గా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పూర్తి కావడంతో తెలుగులో ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ పూర్తైపోయినట్లే. పైగా ఇక్కడ మెగాస్టార్ కాబట్టి పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా కూడా వచ్చిన నష్టం ఏం లేదు. కానీ పక్క భాషల్లో మాత్రం కచ్చితంగా భారీ ప్రమోషన్ అవసరం. అందుకే ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27న ముంబైలో ఓ ఈవెంట్.. 28న చెన్నై, కేరళ.. 29న కర్ణాటకలో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటితో మొత్తం ఇండియాను కవర్ చేసినట్లు అవుతుందని భావిస్తున్నాడు రామ్ చరణ్. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని దాదాపు 6000 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇండియా ఓవర్సీస్ లో భారీస్థాయిలోనే వస్తుంది సైరా. కచ్చితంగా ఈ చిత్రంతో మరో సంచలనం సృష్టిస్తానని ధీమాగా చెబుతున్నాడు మెగాస్టార్. 

More Related Stories