‘తగ్గేదే లే’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎంఈఐఎల్ పీపీరెడ్డి



Taggedhe-le-movie-firstlook-launch
2021-10-12 22:53:08

టాలీవుడ్‌లో కొత్త బ్యానర్ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి ప్రారంభించిన భద్ర ప్రొడక్షన్‌ను ఈ రోజు ఎంఈఐఎల్ పీపీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా తగ్గేదేలే.. అనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటించారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విని ఉంటాం. అలాంటి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మా మామగారి స్ఫూర్తితోనే ఈ బ్యానర్ ప్రారంభమైంది. మా మామగారి తల్లి పేరు భద్రమ్మ. ఆమె పేరు మీదుగానే భద్ర ప్రొడక్షన్‌ను స్థాపించాం. 120 కోట్లకు పైగా ఉన్న జనాబాలో ఎంతో టాలెంట్ ఉంటుంది. అలాంటి వారికి ఈ ఫ్లాట్ ఫాం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కొత్త కథలను చెప్పేందుకు మేం సిద్దంగా ఉన్నాం. మా మొదటి చిత్రం కాన్సెప్ట్ బేస్డ్‌గా రాబోతోంది. శ్రీనివాస రాజు, ఆయన టీం వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది’ అని అన్నారు.

అనంతరం నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ... “భద్ర ప్రొడక్షన్ బ్యాన‌ర్ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన అతిథుల‌కు మ‌రియు మీడియా వారికి ధ‌న్య‌వాదాలు. స‌రికొత్త కాన్సెప్టుల‌తో సినిమాలు తీయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను స్థాపించాం. అందులో మొద‌టి ప్ర‌య‌త్నంగా తగ్గేదే లే సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం. మీ అంద‌రి బ్లెసింగ్స్ ఉండాల‌ని కోరుకుంటున్నాను“అన్నారు.

More Related Stories