గోపీచంద్ కి హీరోయిన్ దొరికేసిందిgopi
2019-09-24 20:54:07

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న చాణక్య సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. దసరా కానుకగా వచ్చే నెల ఐదున ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సైరా తర్వాత రిలీజ్ కానుండడంతో ఆ సినిమా మీద అంత అంచనాలు ఉన్నాయా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే "చాణక్య" సినిమాపై గోపీచంద్ నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాలో విభిన్నమైన లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవకుండానే తన తర్వాతి సినిమాని ప్రకటించేశాడు. తనతో ఇంతకుముందు గౌతంనంద అనే సినిమా చేసిన సంపత్ నంది దర్శకత్వంలో తన తర్వాతి చిత్రం చేయబోతున్నాడు. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరో గోపీ చంద్ సరసన తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ రోజు ప్రకటించింది సినిమా యూనిట్. సంపత్ నంది రామ్ చరణ్ తో చేసిన రచ్చ, రవితేజ హీరోగా చేసిన బెంగాల్ టైగర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తమన్నానే ఈ సినిమాలో నటింపచేస్తున్నారు సంపత్ నంది. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా నటించిన "సైరా" మూవీలో నటించింది. తెలుగులో ఆమె రాజు గారి గది 3 సినిమాలో నటించనుందని చెప్పినా ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఆమె ఎక్కడా కనిపించలేదు.
 

More Related Stories