సూర్యకి గాయాలు ఏమైందంటే Actor Suriya
2020-05-27 19:24:13

తమిళ హీరో సూర్యకు గాయాలయ్యాయనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటి ఇప్పుడు లాక్‌డౌన్‌ కాలంలో గాయాలు ఎలా అయ్యాయా ? అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు తన ఇంట్లో వర్కవుట్‌ చేస్తుండగా ఆయన గాయాల పాలయ్యారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. ఇక ఆయన అభిమానులు తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద పెద్దగా బాధ పడాల్సింది ఏమీ లేదని సూర్య స్ననిహిత వర్గాలు అంటున్నాయి.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని అంటున్నారు. ఇటీవల వర్కవుట్‌ చేస్తుండగా ఆయన ఎడమ చెయ్యికి గాయమైందట. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని ఆ గాయం 90 శాతం నయం కూడా అయిపోయిందట. ఇక గాయం విషయం లేట్ గా బయటకు రావడంతో ఏదో అయిపోయిదని ప్రచారం జరిగింది. ఇక సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ఆ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తరువాత హరి దర్శకత్వంలో అరువా షూటింగ్‌ లో సూర్య పాల్గొననున్నారు.  
 

More Related Stories