ఇండియాలో అబ్బాయిలే లేరా.. తాప్సీ కూడా విదేశీయుడితోనే..tapsee_boyfriend
2020-05-12 14:14:06

ఛీఛీ.. అలాంటి డౌట్ ఎందుకొచ్చింది ఇప్పుడు అనుకుంటున్నారా.. ఏమో ఇప్పుడు మ‌న హీరోయిన్లు చేస్తోన్న ప‌నులు చూస్తుంటే ఇదే అనుమానం వ‌స్తుంది మ‌రి. ఇక్క‌డ అబ్బాయిలే లేన‌ట్లు.. వాళ్ల‌కు త‌గిన వ‌రుడు ఇక్క‌డ దొర‌క‌నే దొర‌క‌న‌ట్లు అంతా ఫారెన్ నుంచి వ‌రుల్ని తెచ్చుకుంటున్నారు. అక్క‌డి వారి ప్రేమ‌లో ప‌డుతున్నారు. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు హీరోయిన్లంతా ఛ‌లో ప‌క్క దేశం అంటున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ కూడా డెన్మార్క్ నుంచి తనకు కాబోయే మొగున్ని దిగుమతి చేసుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మ్యాథియాస్ బో తో ఈమె ప్రేమలో ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇది చేశారు. రెండేళ్ల కింద శ్రీ‌య కూడా ఇదే లిస్ట్ లోకి చేరిపోయింది. పెళ్లిపై చిన్న హింట్ కూడా ఇవ్వ‌కుండా స‌డ‌న్ గా ర‌ష్యా బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూను 2018 మార్చ్ 18న పెళ్లి చేసుకుంది శ్రీ‌య‌.


శ్రీ‌య కంటే ముందే చాలా మంది ముద్దుగుమ్మ‌లు ప‌క్క దేశాల‌కు కోడ‌ళ్లుగా మారిపోయారు. ఇలియానా కూడా ఇప్పుడు మ‌న దేశం కాదు.. లెక్క ప్ర‌కారం చూస్తే ఈమె ఆస్ట్రేలియ‌న్ కోడ‌లు అయ్యుండేది. ఆస్ట్రేలియ‌న్ ఫోటోగ్ర‌ఫ‌ర్ ఆండ్ర్యూ నిబోన్ తో కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉంది. ఈ మ‌ధ్యే బ్రేకప్ చెప్పేసింది. శృతిహాస‌న్ సైతం ప‌క్క దేశం అబ్బాయితోనే చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగింది. ఇప్ప‌టికే త‌న ప్రియుడు మైఖెల్ కోర్సెల్ ను కుటుంబానికి కూడా ప‌రిచ‌యం చేసింది ఈ భామ‌. మూడేళ్లుగా అత‌డితోనే డేటింగ్ లో ఉంది శృతిహాస‌న్. ఇప్పుడు ఈమె కూడా అతని నుంచి విడిపోయి సినిమాలపై ఫోకస్ చేసింది.
ఇక రాధికాఆప్టే అయితే వీళ్లందరి కంటే ముందే బ్రిట‌న్ కోడ‌లైపోయింది. ప్రీతిజంట కూడా అమెరిక‌న్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. 2012లోనే అక్క‌డి మ్యూజిక్ కంపోజర్ బెన్ డిక్ట్ టైల‌ర్ తో ఏడ‌డుగులు న‌డిచింది రాధికా ఆప్టే. బాలీవుడ్ లో ప్రీతిజింటా సైతం ప‌క్క దేశపు అబ్బాయికే ప‌డిపోయింది. ప్రియాంక చోప్రా సైతం  బ్రిటన్ సింగర్  నిక్ జోనస్ ఏడాది కింద పెళ్లి చేసుకుంది. వీళ్ళ కంటే ముందు ఇంకొందరు హీరోయిన్లు కూడా విదేశీయులను పెళ్లి చేసుకున్నారు.


చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన మాధవి తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సలహా మేరకు ఆయన శిష్యుడు రాల్క్ శర్మని 1996లో పెళ్ళిచేసుకుని.. న్యూజెర్సీలో సెటిల్ అయింది. ఈమెకు ముగ్గురు కుతుర్లు. ఒకప్పటి హీరోయిన్ రంభ కూడా 2010లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఈమె. పదహారణాల తెలుగమ్మాయి లయ కూడా  ఒక ఎన్నారైని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది 2006లో సినిమాలను వదిలేసి గణేష్ అనే అమెరికా డాక్టర్ ని పెళ్ళాడింది. లయకు ఇద్దరు పిల్లలు ఈమె కూతురు ఈ మధ్య టాలీవుడ్ లో ఒక సినిమాలో కూడా బాలనటిగా నటించింది.
ఇక 90లలో వచ్చిన సుందరకాండ సినిమాలో రోజా పాత్రలో మెప్పించిన అపర్ణ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు అపర్ణ. 2002లో శ్రీకాంత్ అనే అబ్బాయిల పెళ్ళాడి అమెరికాలోని స్థిరపడిపోయింది. వీళ్ళ కాపురంలో మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా విడాకుల వరకు వచ్చి మళ్లీ కలిసిపోయారు.  భద్ర గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్ 2014లో దుబాయ్ బిజినెస్ మాన్ అనిల్ జాన్ ని పెళ్లాడింది. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఇలా మ‌న ముద్దుగుమ్మ‌లంతా ప‌రాయి దేశాల‌కు కోడ‌ళ్లైపోతున్నారు. 

More Related Stories