బాలయ్య టూర్ ను పిచ్చ లైట్ తీసుకున్న టీడీపీBalakrishna hindupur tour
2021-01-08 13:55:04

టీడీపీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలయ్య కొద్ది  రోజులుగా తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా పర్యటనలో మొదటిరోజు వైసీపీ నేత కొడాలి నాని కి వార్నింగ్ ఇచ్చారు. మాటలు మర్యాదగా మాట్లాడని హెచ్చరించారు. అంతే కాకుండా రెండో రోజు పర్యటనలో సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. జగన్ పాలనలో దేవుళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు దేశం హయాంలో ప్రజలకు మేలు జరిగితే వైసీపీ పాలనలో ఎవ్వరికీ మేలు జరగలేదని విమర్శించారు. జగన్ ది రాక్షస పాలన అంటూ మండిపడ్డారు. కాగా బాలయ్య స్పీచ్ ను మీడియా ఛానల్స్ మారు మోగించాయి. ఆయన స్పీచ్ కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ కూడా ఉంది. యూట్యూబ్ లో బాలయ్యా బాబు స్పీచ్ అని సెర్చ్ చేసి మరీ చూసే అభిమానులు ఉన్నారు. 

కానీ ఆయన సొంత పార్టీ పేస్ బుక్ పేజీని బాలయ్య స్పీచ్ ను విస్మరించడం.. అసలు కవర్ చేయకపోవడం విడ్డూరం. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇతర టీడీపీ నేతలు వర్ల రామయ్య, అయ్యన్న పాత్రుడు ల ప్రెస్ మీట్ లను కవర్ చేసిన టీడీపీ ఫేస్ బుక్ పేజీ బాలయ్యను ఎందుకు విస్మరించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా బాలయ్య తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని పట్టు పట్టగా 25మంది ఉండే పొలిట్ బ్యూరోలో పదవి ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. దాంతో ఆయన పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా హాజరవ్వలేదు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే బాలయ్య తో లోకేష్, చంద్రబాబు మధ్య విబేధాలు ఎక్కువయ్యినట్టే అనిపిస్తోంది. అందువల్లే బాలయ్య టూర్ ను కూడా టీడీపీ పిచ్చ లైట్ తీసుకుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.   

More Related Stories