పూజాను టార్గెట్ చేస్తున్న టీం సమంతా..రంగంలోకి నందిని, చిన్మయి Team samantha
2020-05-29 17:48:17

మునుపెన్నడూ లేని విధంగా సమంత వెర్సస్ పూజా ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీళ్లిద్దరి మధ్య అనే కాదు, అసలు ఇలా ఇద్దరు హీరోయిన్స్ బయటకొచ్చి ఒకరిని ఒకరు అనుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. టీవీలో ‘మజిలీ’ సినిమా చూస్తూ సమంత ఏమంత అందంగా లేదంటూ పూజా ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక పోస్టు చేసింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన పూజ తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఇలా కామెంట్ పెట్టారని పూజా వివరణ ఇచ్చింది. ఆ పోస్టును డెలీట్ చేసింది. అంతటితో వ్యవహారం సద్దుమణిగిందనే అనుకున్నారు కానీ ఇది హ్యాకర్ల పని కాదని పూజ కావాలనే ఇలా విమర్శలు చేస్తుందని సమంతా ఫ్యాన్స్ భావిస్తూ  #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్ ని  వైరల్ చేశారు. ఇక సమంత.. ఆమె స్నేహితురాళ్లయిన దర్శకురాలు నందిని రెడ్డి, గాయని చిన్మయి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పూజా మీద పరోక్షంగా కౌంటర్లు వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముందుగా నందిని రెడ్డి.. ‘వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ’ అంటూ సమంతనుద్దేశించి ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తర్వాత చిన్మయి లైన్లోకి వచ్చి.. ‘‘ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్’ అంటూ మెసేజ్ పెట్టింది.  చివర్లో సమంత.. ‘‘జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్’’ అంటూ పేర్కొనడంతో వీళ్లందరూ పూజా కావాలనే పోస్టు పెట్టిందని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది.  

More Related Stories