ఇష్క్ ట్రైలర్ టాక్ Teja Sajja
2021-04-15 11:56:45

తేజ స‌జ్జ హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఇష్క్‌`. `ఇట్స్ నాట్ ఏ ల‌వ్‌స్టోరీ` అని ఉప‌శీర్షిక‌. వింక్ గ‌ళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. య‌స్.య‌స్‌. రాజు ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌వి ప్ర‌సాద్‌, ప‌రాస్ జైన్, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమా ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగే థ్రిల్ల‌ర్‌లా క‌నిపిస్తోంది. 

More Related Stories