బిగ్ బాస్ తేజస్వి మొగుడు అతడేనంట.. సీక్రేట్ మ్యారేజ్ చేసుకుందా..Tejaswi Madivada
2020-07-13 18:58:29

తేజ‌స్వి మ‌దివాడ. పరిచయం అక్కర్లేని పేరు. కొంత ఇమేజ్ సినిమాల్లో తెచ్చుకుంది.. మరికొంత మాత్రం బిగ్ బాస్ తో తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగమ్మాయి కావడమే ఈమె చేసుకున్న నేరమో ఏమో కానీ బికిని వేసినా కూడా అవకాశాలు మాత్రం రావట్లేదు. ఇప్పుడు కూడా అదిరిపోయే అందాల ఆరబోత చేస్తుంది ఈ బ్యూటీ. తెలుగమ్మాయిలు అందాలను ఆరబోయరనే వాళ్లకు తేజస్విని చూపిస్తే చాలు.. నోరు మూసుకుని అలా వెళ్లిపోతారంతే. ఎప్పటికప్పుడు కొత్తగా తన అందాలను కెమెరా ముందు ఆవిష్కరించడంలో పిహెచ్‌డీకి తాత పూర్తి చేసింది తేజస్వి. షర్ట్ వేసుకుని ప్యాంట్ వేయడం మరిచిపోయావా అంటున్నారు ఈమె తాజా పోటోలు చూసి నెటిజన్లు. ఈ ఫోటోలు చూసి అయ్యో అడవి కాచిన వెన్నెల అయిపోతుందిగా ఈమె అందం అంటున్నారు అభిమానులు. 

రెండేళ్ల కింద బిగ్ బాస్ 2లో కూడా వ‌చ్చింది. అక్క‌డ ఎక్కువ రోజులు ఉండ‌క‌పోయినా త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సామ్రాట్ తో ల‌వ్ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా సాగింది. దాంతో తేజ‌స్వికి బ‌య‌ట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది. ఇదే అదునుగా ఇప్పుడు బ‌య‌ట కూడా అందాల‌నే న‌మ్ముకుంటుంది. ఒక్కో సినిమాతో పాపులారిటీ పెంచేసుకుంటుంది తేజ‌స్వీ. 

ఇదిలా ఉంటే తాజాగా ఈమె పుట్టిన రోజు సంరద్భంగా ఓ ఫోటోను విడుదల చేసింది తేజస్వి. అందులో ఓ కుర్రాడి ఫోటో చూపించి హస్బెండ్ అంటూ పరిచయం చేసింది. అంటే ఎవరికీ చెప్పకుండా సీక్రేట్ మ్యారేజ్ చేసుకుందా ఈ అమ్మడు అంటూ అనుమానాలు కూడా ఇప్పుడు మొదలైపోయాయి. దాంతో సోషల్ మీడియాలో కొందరు అసలు ఎవరా వ్యక్తి అంటూ వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయినా మొగుడు అనడానికి.. కాబోయే మొగుడు అనడానికి చాలా తేడా ఉంది. హస్బెండ్ అనేసిందంటే సీక్రేట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలే వినిపిస్తున్నాయి.

More Related Stories