టాలీవుడ్ లో సత్తా చాటుతున్న తెలంగాణ హీరోలు డైరెక్టర్లు



Tollywood
2021-05-18 10:28:09

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో కేలవం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కనిపించేవారు. దర్శకులైనా..హీరోలైనా ఎవరైనా ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చినవాళ్లే. అయితే ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. తెలంగాణా నుండి వచ్చిన హీరోలు, దర్శకులు సైతం టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. టాప్ హీరోలుగా అగ్రదర్శకులుగా ఎదిగారు. అలా తెలంగాణ నుండి వచ్చి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న దర్శకులు, హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ప్రస్తుతం టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో పెరిగినా ఆయన తాతలది కూడా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా. అంతే కాకుండా హీరో నితిన్ కూడా తెలంగాణ హీరోనే. నిజామాబాద్ జిల్లాకు చెందిన నితిన్ ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉండగా యంగ్ హీరో నిఖిల్ కూడా తెలంగాణా కుర్రాడే. నిఖిల్ పక్కా హైదరాబాద్ కుర్రాడు కాగా అతడి కుటుంబీకులు కూడా హైదరాబాదిలే. 

ఇక తెలంగాణ నుండి టాలీవుడ్ లో సత్తా చాటుతున్న దర్శకుల విషయానికి వస్తే...అర్జున్ రెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. అతడూ పుట్టి పెరిగింది కూడా కాకతీయ కంచుకోట వరంగల్. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి ఏకంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం తెలంగాణ కుర్రాడే. రేసు గుర్రం, సైరా నర్సింహారెడ్డి లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ తో "ఏజెంట్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా పెళ్లి చూపులు సినిమాను తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ కూడా తెలంగాణాకు చెండినవాడే. మరోవైపు ఇటీవల జాతిరత్నాలు సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్ దర్శకుడు అనుదీప్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే.

More Related Stories