అక్టోబర్ 19 వరకు దసరా సెలవుల పొడగింపు.. సైరాకు పండగే..syeraa1
2019-10-12 21:39:10

సెలవులు మరో వారం రోజులు పొడగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. RTC కార్మికులు స్ట్రైక్‌ చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పుడు సైరాకు మరింత లాభం రానుంది. ఊళ్లకు వెళ్లిన వాళ్లు తిరిగి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే RTC స్ట్రైక్‌ ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగులు ఎవరికి వాళ్లు దిగిరావడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో RTC స్ట్రైక్‌తో ప్రజలు ఇబ్బందులు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దసరా సెలవులను మరో మూడు రోజులు పొడగించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 19 వరకు సెలవులు మరో వారం రోజులు పొడగించారు.

దాంతో సైరా సినిమాకు మరింత హెల్ప్ కానుంది ఇది. కచ్చితంగా వారం రోజులు సెలవులు పొడగిస్తే తెలంగాణలో వసూళ్ళు మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే విడుదలైన 10వ రోజు కూడా 2.80 కోట్లు షేర్ వసూలు చేసింది సైరా. ఈ లెక్కన పండగ హాలీడేస్ మరో మూడు రోజులు కానీ పెరిగాయంటే మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర మాయచేయడం ఖాయం. అక్టోబర్ 14న రీ ఓపెన్ కావాల్సిన స్కూల్స్ కాస్తా ఇప్పుడు అక్టోబర్ 19 వరకు మూత పడనున్నాయి. దాంతో ఈ సెలవులు కూడా సైరాకు బాగానే కలిసొస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మరి వీటిని చిరు ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలిక.

More Related Stories