ఎన్టీఆర్ ను కలిసిన తెలంగాణ మంత్రిPuvvada Ajay Kumar
2021-07-06 00:24:04

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కొడుకు నయన్ పుట్టినరోజు సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు శాలువా కప్పి పుష్ప గుచ్చాన్ని అందించారు. ఇదిలా ఉండగా పువ్వాడ అజయ్ కుమార్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఇటీవల ఖమ్మంలో ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో మెగాస్టార్ చిరు ని ఇంటికి పిలిపించి ఆతిథ్యం ఇచ్చారు. 

అంతేకాకుండా ఓసారి హైదరాబాద్ లో ఆచార్య షూటింగ్ జరుగుతున్న సందర్భంలో మెగాస్టార్ ను కలిసి మాట్లాడారు. ఇప్పుడు ఎన్టీఆర్ ను సైతం కలవడంతో పువ్వాడ అజయ్ కి సినిమా వాళ్ళ పై ఎంతో అభిమానం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రంలో ఎన్.టి.ఆర్ కి జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సంబంధించిన టీజర్ మరియు పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా అనుకున్న డేట్ కి సినిమాను విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More Related Stories