తెలంగాణలో థియేటర్లు తెరుచుకున్నాయి



Telangana
2020-12-04 13:10:26

తెలంగాణలో ఈరోజు నుండి థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రధాన జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. కాకపోతే రిలీజ్ కు మాత్రం నేడు కొత్త సినిమలేవీ లేవు. ఈరోజు హైదరాబాద్ థియేటర్లలో టినెట్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు మల్టిప్లెక్స్ లు క్యూ కట్టాయి. టికెట్లు కూడా హైదరాబాద్ లో జోరుగా బుక్కైనట్టు తెలుస్తోంది. ఈరోజు దాదాపు అన్ని థియేటర్లలో 50 శాతం సీట్లు నిండనున్నాయి.

 ఇక హిందీ నుండి వార్, తెలుగు నుండి అర్జున్ రెడ్డి, కనులు కనులను దోచేనే సినిమాలు రిలీజ్ చేశారు. ఈ సంధర్భంగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడ్డానికి వచ్చారు. ఇంటి నుండి థియేటర్ లు భయలు దేరిన సాయి ధరమ్ తేజ్ ఓ వీడియోను కూడా రికార్డ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించారు. 8 నెలల తరువాత మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాయని..వచ్చి ఎంజాయ్ చేయాలని అన్నారు.  మాస్కులు ధరించి సినిమా చూడాలని చెప్పారు.

More Related Stories