బన్నీ వాస్ మోసం చేశాడు...ఫిలిం ఛాంబర్ వద్ద గొలుసులతోvasu
2019-09-04 19:46:05

క్యాస్టింగ్ కోచ్ అంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్‌ ముందు శ్రీ రెడ్డి బట్టలు తీసేసి అర్ధ నగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అదే ఇప్పటి దాకా ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ గా ఉంటూ వస్తోంది. తాజాగా అదే గేటు వద్ద మరో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతి నిరసనకు దిగింది. నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని పేర్కొంటూ సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టు ఆందోళనకి దిగింది. జనసేన పార్టీ కోసం తాను కష్టపడితే తనను ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు అవేమీ చేయకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ ఆమె ఆందోళనకి దిగింది. ఫిలిం ఛాంబర్ వద్ద గొలుసులతో తనను తాను బందించుకుని రాత్రంతా ఆమె నిరసన వ్యక్తం చేసింది.

గీతా ఆర్ట్స్ లో సినిమా ఛాన్సులు  ఇస్తానని నిర్మాత బన్నీ వాస్ తనను మోసం చేశారని, ఇప్పుడు ఈ విషయం మీద అల్లు అరవింద్ స్పందించాలని  డిమాండ్ చేస్తూ ఆమె రాత్రంతా అక్కడే ఉంది. ఆమె ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించి పేటీఎం చేశాడని ఆమె ఆరోపణలు చేసి హైలైట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ రకమైన ఆరోపణలు చేస్తోంది. మరి ఈ విషయం మీద బన్నీ వాస్ కానీ గీతా ఆర్ట్స్ కానీ ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

More Related Stories