కరోనాతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ మృతి Pokuri Ramarao
2020-07-04 18:26:49

కరోనా విజ్రుంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ భయానికి సినిమా వాళ్ళు ఎవరూ షూట్ లు కూడా పెట్టుకోవడం లేదు. కేవలం సీరియల్స్ వాళ్ళు, అలాగే టీవీ షోలు మాత్రమె షూట్ చేస్తున్నారు. వారిలో కూడా కరోనా కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగించే అంశం అనే చెప్పాలి. ఇక సినిమా వాళ్ళ విషయానికి వస్తే బండ్ల లాంటి వాళ్ళు కరోనా బారిన పడి కోలుకున్నారు కూడా. అయితే టాలీవుడ్ కి చెందిన ఒక నిర్మాత ఏకంగా కరోనా కారణంగా కన్నుమూయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిర్మాత పోకూరి రామారావు నిన్న సాయంత్రం కరోన కారణంగా మృతి చెందారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈతరం ఫిలిమ్స్ పోకూరి రామారావు సోదరుడే ఈ పోకూరి బాబురావు. ఈయన తన అన్నతో కలిసి ఎన్నో సినిమాలు సహ నిర్మాతగా, నిర్మాతగా చేశారు. గోపీచంద్ తండ్రి టీ కృష్ణతో వీరు సన్నిహితంగా ఉండేవారు. అలా గోపీచంద్ ని కూడా సినిమాల్లో వచ్చిన మొదటిలో ఈ అన్నదమ్ములు ఎంతో సపోర్ట్ చేశారు. గోపీతో కలిసి యజ్ఞం, రణం సినిమాలను కూడా వీరు నిర్మించారు.

More Related Stories