టాలీవుడ్ ప్రముఖ గాయని సునిత రెండో పెళ్లిTelugu singer Sunitha
2020-11-30 11:13:08

టాలీవుడ్ ప్రముఖ గాయని సునిత తన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగుతో ఇతర భాషల్లోనూ పాటలు పాడి అలరిస్తోంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టివి షోలతో సునిత మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సునిత ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఏ కార్యక్రమానికి వచ్చినా నవ్వులు కురిపిస్తూ కానిపిస్తోంది. అయితే ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సునిత జీవితంలో ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయట. 19ఏళ్లకే సునితకు వివాహం జరగ్గా భర్త వైఖరి నచ్చకపోవడంతో అతడికి విడాకులిచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల అలీ తో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పింది. తనపై ఎన్నో రూమర్లు వస్తున్నాయని అవన్నీ అవాస్తవాలని చెప్పింది. తన గురించి తన ఫ్యామిలీకి తెలుసని వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పింది. పుకార్లతో సంబంధం లేదని తానెప్పుడూ సింగిల్ గానే ఉంటానని తెలిపింది. అయితే ఇప్పుడు సునిత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ మీడియా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ బిసినెస్ మ్యాన్ ను సునిత పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతడికి కూడా ఇది రెండో వివాహమే అని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సునిత పెళ్లి ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్టు తెలుస్తోంది.

More Related Stories