మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ తీరినట్టే .....Chiranjeevi Koratala movie update.jpg
2019-12-28 16:38:25

చిరంజీవి, కొరటాల సినిమా పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా షూటింగ్ జరగడం లేదని ప్రచారం జరిగింది. ఈ సినిమాను జనవరి తర్వాత పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం మొదలయింది. అయితే మెగా ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే బయటకొచ్చిన వార్త ఏంటంటే ఈరోజు నుండి చిరంజీవి- కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలైందట !.

కోకాపేటలో వేసిన ప్రతేక సెట్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుతున్నారని అంటున్నారు. సంక్రాంతి వరకూ పెద్ద బ్రేక్స్ లేకుండా మొదటి షెడ్యూల్ ను మొత్తం ప్లాన్ చేసినట్లు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చేబుహ్తున్నారు. సంక్రాంతికి నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ తిరిగి షూటింగ్ ను మొదలుపెడతారు. వేసవికి ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాలని షెడ్యూల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే హాలిడే సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గ  ఎంపికైనట్లుగా సమాచారం.  ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే క్లర్క్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారు.

More Related Stories