తమిళ్ పొలిటికల్ స్క్రీన్ పైకి విజయ్..31న పార్టీ ప్రకటన



Thalapathy Vijay
2020-12-29 14:07:34

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలకు నో చెప్పడంతో తెరపైకి మరో స్టార్ హీరో వచ్చాడు. తమిళ్ పొలిటికల్ స్క్రీన్ పై ఇప్పుడు హీరో విజయ్ పేరు వినిపిస్తోంది. ఇక ఇప్పటికే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పలనీస్వామిని కలవడం తమిళ రాజకీయాల్లో చర్చగా మారింది. అంతేకాకుండా ఈనెల 31న విజయ్ పార్టీని ప్రకటిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అది కూడా జయలలిత సమాధి వద్ద విజయ్ తన పార్టీని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.  అయితే రజినీకాంత్ పొలిటికల్ పార్టీ, అళగిరి పార్టీ తో తమిళనాడులో డీఎంకే ఓటు బ్యాంకును చీల్చేలా భారీ స్కెచ్ వేశారట. 

కానీ ఇప్పుడు రజినీకాంత్ వెనక్కి తగ్గడంతో ఆ ప్లేస్ లోకి విజయ్ వచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఈనెల 31న విజయ్ పార్టీని ప్రకటిస్తాడా లేదా చూడాలి. ఇదిలా ఉండగా విజయ్ తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ ఇటీవల ఓ పార్టీని స్థాపించి విజయ్ పేరును ఆ పార్టీకి పెట్టారు. కానీ విజయ్ మాత్రం తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని..తన ఫ్యాన్స్ ఎవరూ ఆ పార్టీలో పనిచేయకూడదని స్పష్టం చేశారు. అప్పట్లో తమిళ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఈవిషయంపై మీడియా విజయ్ తల్లిని సంప్రదిస్తే వారిద్దరికీ కొన్ని విబేధాలు ఉన్నాయని..పార్టీతో విజయ్ కి సంబంధం లేదని చెప్పింది. ఇక విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

More Related Stories