దేశం కాని దేశంలో ఇరుక్కుపోయిన స్టార్ హీరో కొడుకు.. Thalapathy Vijay
2020-04-15 17:13:50

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే లాక్ డౌన్ కారణంగా లాక్ అయిపోయారు. కదలడానికి వీళ్లేదు.. కదిలితే కరోనా కాటేస్తుందని భయం. కొందరికి కావాల్సిన వాళ్లు పక్క దేశంలోనే లాక్ అయిపోయారు. టాలీవుడ్ నుంచి కూడా మంచు విష్ణు భార్య పిల్లలు సింగపూర్ లోనే లాక్ అయిపోయారు. ఇక ఇప్పుడు మరో ఘటన కూడా ఇలాంటిదే జరిగింది. కోలీవుడ్ సూపర్ స్టార్, దళపతి విజయ్ కొడుకు ప్రస్తుతం కెనడాలో ఇరుక్కుపోయాడు. ఇప్పటికే 21 రోజుల లాక్ డౌన్ ముగియడంతో మరో 19 రోజుల పాటు పొడిగించాడు మోదీ. దాంతో ఇప్పటికైనా సొంతూళ్లకు వద్దామని వేచి చూస్తున్న వాళ్లకు మరోసారి షాక్ తగిలింది.

ఇప్పటికే ఇతర దేశాల్లో స్టక్ అయిపోయిన వాళ్లు అక్కడే ఉన్నారు.. మే 3 వరకు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ కూడా కెనడాలో లాక్ అయిపోయాడు. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కెనడాలో ఉంటున్నాడు.. అక్కడే ఈ కుర్రాడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు.. త్వరలోనే ఈయన తమిళ ఇండస్ట్రీకి అరంగేట్రం కూడా చేయబోతున్నాడు. అయితే కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ విధించడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో విజయ్ తనయుడు కెనడాలోనే చిక్కుకుపోయాడు. దీంతో హీరో విజయ్ ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. తన ఇన్ఫ్లూయన్స్ అంతా వాడినా కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అందుకే రోజూ వీడియో కాల్ లో కొడుకు బాగోగులు చూసుకుంటున్నాడు ఈయన. 

More Related Stories