మహేష్ ను టార్గెట్ చేసినా థమన్ కే ఎందుకు అవకాశంMahesh
2020-06-01 18:02:42

మొన్నటి సంక్రాంతి సమయాన రెండు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. రెండు సినిమాల యూనిట్స్ రెండు దేశాల వాళ్ళు కొట్టుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసుకుంటూ రసవత్తరం అయ్యేలా చేశారు. రెండు సినిమాలలో ఎవరు నెగ్గారు అనే విషయం పక్కన పెడితే అల వైకుంఠపురం’ సినిమా విజయోత్సవాలలో ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్లు ఫేక్ అంటూ సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.  'అల వైకుంఠపురములో' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల మధ్య మహేష్ బన్నీల ఇగో వార్ నడుస్తోన్న సమయంలో ఆయన ఏకంగా స్టేజ్ మీద 'నిజమైన మాటలే మాట్లాడుకుందాం నిజమైన కలెక్షన్లే చెప్పుకుందాం' అని అనడం, థమన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలకు అల్లు అరవింద్ త్రివిక్రమ్ బన్నీలు పకపకా నవ్వడంతో వారి మీద కెమెరాల కన్ను పడింది. దీంతో మహేష్ అభిమానులు థమన్ ను టార్గెట్ చేస్తూ షోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకున్నారు. 

మహేష్ బాబు ఈ విషయంలో సీరియస్ గా ఉంటారని అంతా అనుకున్నారు. ఇక తన సినిమాల్లో ఎప్పుడూ అవకాశం ఇవ్వడని అంతా ఫిక్స్ కూడా అయిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే మహేష్ బాబు-పరుశురాం తాజా చిత్రం ‘సర్కార్ వారి పాట’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నట్టు నిన్న పోస్టర్ లో క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఈ కాంబినేషన్ ఎవరూ ఊహించలేదు. పరుశురామ్ తో ఇది వరకు గీతాగోవిందం సినిమాకు చేసిన గోపి సుందర్ మహేష్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా అనుకుంటున్న సమయంలో థమన్ ఆన్ బోర్డ్ రావడం గమనార్హం. 

పరుశురాం తన టీమ్ ను కాదని మహేష్ కోసం ది బెస్ట్ టీమ్ ను రెడీ చేశారు. జాతీయ అవార్డ్ పొందిన సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్, ఆర్ట్ విషయంలో ఏఎస్ ప్రకాశ్, ఎడిటింగ్ కోసం మార్తాండ్ కే వెంకటేశ్ కు ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారు. థమన్ కూడా వరుస్ హిట్స్ తో మంచి ఊపు మీదున్నాడు. ‘అల వైకుంఠపురం’ హిట్ కొట్టి వకీల్ సాబ్ తో హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. అందుకేనేమో తనపై విమర్శలు చేసినా కూడా మహేష్ బాబు తన సినిమాకి థమన్ ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఆ టైంలో తమన్ ను అంతలా ట్రోల్ చేసిన మహేష్ ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటో ?

More Related Stories