నాని సినిమా కోసం రంగంలోకి దిగిన తమన్Nani
2020-01-24 11:22:52

నాచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శ్కాత్వంలో వీ అనే సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్న నాని ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా పేరు “టక్ జగదీష్”. 

ఇటీవల టైటిల్ తో కూడిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను షైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా ట్యూన్స్ కోసం ఇప్పటికే థమన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్నే థమన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 

శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో అదే కాంబినేషన్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” పై కూడా అంచనాలు ఉన్నాయి. అయితే సంక్రాంతికి హిట్ కొట్టిన అల వైకుంఠపురంలో’ సినిమా విజయానికి తమన్ అందించిన ఆడియో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఎంత ఊతం ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి నాని సినిమాకి ఎటువంటి మ్యాజిక్ చేయనున్నాడో తమన్.

More Related Stories