ఫ్యామిలీ మ్యాన్ కోసం కొత్త ప్రయోగం చేస్తోన్న సమంతా Samantha
2020-06-01 15:56:04

టాలీవుడ్ లో తనదైన సినిమాలతో ముద్ర వేసిన సమంతా ఈ మధ్య ఎందుకో కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. గత ఏడాది మజిలీ, ఓ బేబీ సినిమాలు చేసిన ఆమె ఆ తరువాత జాను సినిమా మాత్రమె చేసింది. ఆ సినిమా రిలీజయినా పెద్దగా ఆడలేదు. అయితే ఆమె సినిమాలు ఏవీ ఒప్పుకోక పోవడంతో ఆమెకు ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా అని కూడా ప్రచారం జరిగింది అనుకోండి. అది వేరే విషయం. అయితే ఆమె తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అదే ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఈ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కి సీక్వెల్. ఆమెజాన్ లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ని రాజ్‌ నిడమోరు, కృష్ణ డికే సంయుక్తంగా తెరకెక్కించారు. 

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణిలు లీడ్ రోల్స్ లో నటించిన ఈ రెండో భాగం షూటింగ్ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆమెజన్ లో దీనిని రిలీజ్ కూడా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సిరీస్ కోసమే సామ్‌ తొలిసారి ఓ కొత్త ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అదేంటంటే ఈ వెబ్‌ సిరీస్‌ కోసం హిందీలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకో బోతుందట సామ్‌. ఇప్పటికే దీనికి తగ్గట్లుగా లాక్ డౌన్ సమయంలో హిందీలో తన ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సిరీస్‌ లో ఒక టెర్రరిస్ట్ గా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా దీన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Related Stories