చిరంజీవి గుండు కొట్టించుకోవడం వెనక అసలు కారణం అదేనా..Chiranjeevis Urban Monk Look
2020-09-11 16:41:06

సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చిరంజీవిలో ఏదో తెలియని జోష్ కనిపిస్తుంది. ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని అభిమానులతో పంచుకోవడం అలవాటు చేసుకున్నాడు మెగాస్టార్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఈయన కొత్త లుక్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. సన్యాసిలా ఉన్నానా లేదా అంటూ ప్రశ్నించాడు మెగాస్టార్. ఉన్నట్లుండి మెగాస్టార్ కాస్తా గుండు బాస్ కావడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. అదేంటి ఇలా మారిపోయాడు.. ఏదైనా కొత్త లుక్ ట్రై చేస్తున్నాడా లేదంటే ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని కొత్తగా ట్రై చేస్తున్నాడా అంటూ అనుమానపడ్డాడు. పైగా చిరంజీవి క్యాప్షన్ కూడా సన్యాసిలా ఉన్నానా అని అడగడం కూడా చిత్రంగా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా కోట్లాది మంది అభిమానులు ఆ ఫోటోను చూసి మెగా లుక్ అదిరిపోయింది బాసూ అంటున్నారు. ఈ మధ్య ఎప్పటికప్పుడు కొత్త లుక్ ట్రై చేస్తూనే ఉన్నాడు చిరంజీవి. ఆ మధ్య బ్లఫ్ మాస్టర్ సినిమాను చూసి దర్శకుడు గోపీ గణేష్‌ను కలిసినపుడు మీసాలు తీసేసాడు. అప్పుడు ఆ లుక్ వైరల్ అయిపోయింది. అడిగితే ఊరికే తీసానని చెప్పాడు. ఇప్పుడు గుండు చేయించుకున్నాడు. స్టైల్‌గా గ్లాసెస్ పెట్టుకుని మెగాస్టార్ పోస్ట్ చేసిన ఫోటో చూసి అంతా ఫిదా అయిపోయారు.

వామ్మో చిరు ఏంటి ఇలా మారిపోయాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ లుక్ చేసింది సరదా కోసం మాత్రం కాదని తెలుస్తుంది. వేదాళం సినిమా రీమేక్ కోసమే చిరంజీవి ఇలా మారిపోయాడు. ఈ సినిమా లుక్ టెస్ట్ చేయించుకోవడం కోసమే గుండు చేయించుకున్నాడు మెగాస్టార్. ఐదేళ్ల కింద వచ్చిన ఈ సినిమాను అప్పట్లో పవన్ హీరోగా నీసన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం. పూజా కార్యక్రమాలు కూడా చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇదే సినిమాను ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాడు. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో అజిత్ చిన్న వెంట్రుకలతో గుండుతోనే ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్ కోసం ఇప్పుడు చిరంజీవి కూడా గుండు చేయించుకున్నట్లు అర్థమవుతుంది. ఆ లుక్ టెస్ట్ కోసమే చిరు ఇలా చేసాడంటున్నారు విశ్లేషకులు కూడా. ఆచార్య షూటింగ్ కు ఎలాగూ మూడు నెలలు ఉంది కాబట్టి ఆ లోపు మళ్లీ జుట్టు వచ్చేస్తుంది. దాంతో ధైర్యం చేసాడు మెగాస్టార్. 

More Related Stories