చిరంజీవి, కొరటాల సినిమాలో ముఖ్య విశేషాలు ఇవే..Chiranjeevi Koratala Siva.jpg
2019-10-13 06:49:19

చిరంజీవి కొరటాల సినిమాపై ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా భారీ అంచనాలున్నాయి. రాజమౌళి మాదిరే కొర‌టాల కూడా అపజయం ఎరుగని దర్శకుడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌.. 

ఇప్పుడు సైరాతో చిరంజీవి కూడా జోరు మీదున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా నవంబర్ నుంచి మొదలు కానుంది. ఠాగూర్ త‌ర‌హాలోనే ఇది కూడా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అందులో లంచం గురించి చెబితే ఇందులో నిరుద్యోగం గురించి చెప్ప‌బోతున్నాడు చిరంజీవి. కొర‌టాల కూడా ఈ క‌థ‌ను ప‌క్కాగా సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉంటాడని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజంలేదని తెలుస్తుంది. కేవలం 90 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి చూపిస్తానంటున్నాడు కొరటాల. షూటింగ్ అంతా కేరళ, హైదరాబాద్ లో ఉంటుందని.. ఎక్కడా ఫారెన్ వెళ్లేది కూడా లేదని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

ఇక ఈ చిత్రం కోసం విలేజ్ సెట్ తో పాటు ప్రత్యేకంగా గుడి సెట్ కూడా వేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అదే సినిమాకు ప్రాణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. వాళ్లెవరో త్వరలోనే చెప్తామంటున్నారు మేకర్స్. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ విడుదలకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories