విషాదం.. సోదరుడు మరణించిన మూడు రోజులకే కన్నుమూసిన ప్రముఖ నటి..Usha Ganguly
2020-04-25 19:12:52

ఓవైపు కరోనా వైరస్ కాటేస్తుంటే మరోవైపు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. నిన్న మధ్య సల్మాన్ ఖాన్ మేనల్లుడు.. ఆ తర్వాత కన్నడ నటుడు.. మొన్నటికి మొన్న రాజీవ్ కనకాల చెల్లెలు.. మిథున్ చక్రవర్తి తండ్రి ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనుకోకుండా కన్నుమూశారు. తాజాగా మరో ప్రముఖ నటి గుండెపోటుతో మరణించారు బెంగాలిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉషా గంగూలీ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన ఫ్లాట్‌లో ఉషా గంగూలీ పడిపోయి ఉండడం చూసిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. 

ఆమె భర్త కమలేందు కొన్నేళ్ల క్రితం మరణించారు. ఇక్కడ మరో విషాదమేంటంటే  ఉషా గంగూలీ సోదరుడు కేవలం మూడు రోజుల కింద కన్నుమూశాడు. ఆయన మరణాన్ని ఇంకా మరిచిపోకముందే అప్పుడే ఉష కూడా కన్నుమూయడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది. ఈమె మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.. చిత్ర పరిశ్రమకి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్న మమతా 2016లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉషా గంగూలీకి గిరీష్ సమ్మన్ గౌరవాన్ని అందజేసిందని చెప్పారు. ఉషా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు మమతా బెనర్జీ. షబానా ఆజ్మీ, అపర్ణా సేన్ లాంటి సినీ ప్రముఖులు ఉషా మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. 

More Related Stories