ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటేBig Boss.jpg
2019-09-07 21:43:43

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో బిగ్ బాస్ లో ఏడవ వారం ఎలిమినేషన్ కూడా వచ్చేసింది. తాజాగా ఇంటికి కొత్త కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎన్నికయ్యారు. శిల్పా చక్రవర్తి సాయంతో బాబా భాస్కర్ కెప్టెన్ సీటులో కూర్చున్నారు. అయితే ఇక రేపు ఎలిమినేషన్ జరగనుంది. అయితే ఏడో వారం ఎలిమినేషన్‌లో మరో ఐదుగుర్ని ఉంచారు బిగ్ బాస్ వాళ్లను ఓట్లు వేసి గెలిపించండి అంటూ మళ్లీ ఊదరకొడుతున్నారు. 

నామినేషన్ లో ఉన్నవారు రాహుల్, మహేష్, శ్రీ ముఖి, రవి మరియు అలీ రెజా. సీజన్ మొదలైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నామినేషన్ల లో లేని అలీ దురదృష్టవశాత్తు ఈ వారం మొట్టమొదటిసారి నామినేట్ అయ్యాడు. అయితే ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లబోయే ఇంటి సభ్యుడు అతనేనని సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది. ముందు నుండీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కావడంతో ఈ వారం కూడా ఆయనే ఎలిమినేట్ అవుతాడో లేదో చూడాలి.

More Related Stories