ప‌వ‌న్‌, చిరు, ప్ర‌భాస్ సినిమాల టైటిల్స్ ఇవేనా ..Pawan Kalyan
2020-02-08 13:09:38

తెలుగులో అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు భారీ అంచనాల నడుమ వస్తున్నాయి కాబట్టి హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ `నంబర్ 150`తో బ్లాక్ బస్టర్ కొట్టి..152వ చిత్రం సైరా నరసింహారెడ్డి దేబ్బెసింది కాబట్టి కొరటాల సినిమా ఆయన ఫ్యాన్స్ కి. 

మొన్నటివరకూ రాజకీయాల్లో బిజీగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా పవన్ రీఎంట్రీ ఇస్తుండడంతో పీకే 26 పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రభాస్ సాహో సినిమా అంచనాలు అందుకోవడంలో దెబ్బ పడడంతో ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతన్న పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. 

అయితే ఆ ముగ్గురి టైటిల్స్ పై నెలకొన్న సందిగ్ధత కొంచెం తొలగినట్టే ఎందుకంటే చాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్స్ ని పరిశీలిస్తే ఆ క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రానికి కొరటాల శివ `ఆచార్య ` అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. 

ఇక పవర్ స్టార్ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో `వకీల్ సాబ్` అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు. ఇక ప్రభాస్ కథానాయకుడిగా `జిల్` ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇప్పటికే జాన్ అనే టైటిల్ ప్రేక్షకుల్లోకి వెళ్లగా ఇప్పుడు `రాధేశ్యామ్` అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు యూవీ వాళ్ళు. అలా మూడు సినిమాలకి మూడు టైటిల్స్ ఫిక్స్ అయిపోయినట్టే.

More Related Stories