కాన్సర్‌ను ఓడించి ఇప్పుడు సినిమాల్లో గెలవడానికి..Sonali Bendre.jpg
2019-10-15 08:08:00

సోనాలి బింద్రే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో సంచలన సినిమాలు చేసింది ఈమె. చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో నటించడమే కాకుండా మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ కు పరిమితం అయిపోయింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు మానేసింది సోనాలి. ఆ తర్వాత అనుకోకుండా క్యాన్సర్‌ బారిన పడింది. దాదాపు ఏడాది పాటు దాంతో పోరాడింది.. చివరికి గెలిచింది. గత డిసెంబర్‌లో ఆమెకు క్యాన్సర్ సోకినట్లు గుర్తించడంతో న్యూయార్క్‌లో కొన్ని నెలలుండి చికిత్స తీసుకుంది. మొక్కువోని ధైర్యంతో ఆమె క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. ఈ సమయంలో జీవితం తనకెన్నో పాఠాలు నేర్పించిందని వేదాంతం కూడా చెప్పేసింది సోనాలి. చావు అంచుల వరకు వెళ్లొచ్చిన తనకు అన్నీ తెలిసి వచ్చాయని చెప్తుంటుంది సోనాలి బింద్రే.

ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. బాలీవుడ్‌లోకి సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది సోనాలి. అవకాశం వస్తే కచ్చితంగా అందరు హీరోలతోనూ మళ్లీ నటిస్తాను అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఒక టాలెంట్ బేస్డ్ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తుంది సోనాలి బింద్రే. తనకు ఖాళీగా ఉంటే అస్సలు తోచదని.. ఎప్పుడూ పని పని పని అంటూ ఉండాలంటుంది సోనాలి. అందుకే కేవలం డబ్బు కోసమే కాకుండా తనకు ఆత్మసంతృప్తి కోసం సినిమాలు చేయాలని ఉందని చెబుతుంది ఈమె. మరి సోనాలి అడుగుతున్న అవకాశాలు ఏ దర్శకుడు ఇస్తాడో చూడాలిక. 

More Related Stories