టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం



Tollywood drug case
2021-01-04 12:59:58

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం భయట పడింది. గతంలో పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీలపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసులో పలువురు సెలబ్రెటీలను సైతం అధికారులు ప్రశ్నించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కేసు ముందుకు వెళ్ళలేదు. తాజాగా నిన్న ఓ టాలీవుడ్ నటి ముంబై లోని ఓ హోటల్ లో డ్రగ్స్ సప్లయర్స్ తో కలిసి పట్టుబడింది. దాంతో నటి తో పాటు డ్రగ్స్ సప్లయర్స్ విక్రేత చాంద్ మహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి అధికారులు 8 నుండి 10లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సయీద్ అనే నిందితుడు పరారైయ్యాడు. అయితే ఈరోజు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన నటిని ఎన్సీబీ ముంబై కోర్టులో ప్రవేశపెట్టింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ సప్లయర్స్ తో నటికి ఉన్న సంబంధాలపై ఎన్సిబి ఆరా తీస్తోంది. సదరు నటి నాలుగు తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించినట్టు తెలుస్తోంది. నటితో పాటు టాలీవుడ్ లో మరెవరికైనా సంబంధాలు ఉన్నాయా అన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
 

More Related Stories