ఏప్రిల్ నెల 31 రోజుల్లో 35 సినిమాలు



Tollywood
2021-04-01 16:01:55

టాలీవుడ్ పూర్వ వైభ‌వాన్నిసంత‌రించుకుంది. థియేట‌ర్ ల‌లో వ‌రుస‌ల సినిమాల‌తో సంద‌డి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లై క్రాక్, ఉప్పెన‌, జాతిర‌త్నాలు సినిమాల‌కు హౌస్ ఫుల్ బోర్డులు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ హీరోల సినిమాలు విడుద‌లకాలేద‌న్న వెలితి మాత్రం స‌ద‌రు ప్రేక్ష‌కుడిలో ఉండిపోయింది. కాగా ఎప్రిల్ లో ఆ కోరిక సైతం తీర‌బోతుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీస్ సాబ్ తో వ‌స్తున్నారు. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో వ‌స్తున్నారు. రానా విరాట ప‌ర్వం సినిమాతో ముందుకు వ‌స్తున్నాడు. ఇక నాని ట‌క‌జ‌గ‌దీశ్ కూడా ఈ నెల‌లోనే విడుద‌ల కాబోతుంది. అంతే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా విడుద‌ల కానున్నాయి. ఇక మొత్తం ఈ నెల‌లో 31 రోజ‌లకు గాను 35 సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఆ లిస్ట్ ఇప్ప‌డు చూద్దాం. 

ఎప్రిల్ 2న నాగార్జున హీరోగా న‌టించిన వైల్డ్ డాగ్ సినిమా విడుద‌ల కాబోతుంది. అంతే కాకుండా సుల్తాన్, వై,సూర్య వంశీ, పీట‌ర్ రాబిట్, బ్లాక్డ్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇక ఎప్రిల్ 9న వ‌కీల్ సాబ్, క‌ర్ణ‌న్‌, బ్రాందీ డైరీస్, చెహెర్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇక ఎప్రిల్ 16న ల‌వ్ స్టోరీ, టెంప్ట్ రాజా, క‌థానిక‌, స‌ర్వంసిద్ధం, ఇట్లు అంజ‌లి, ఆర‌డుగుల బుల్లెట్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. మ‌రోవైపు ఎప్రిల్ 22న ట‌క్ జ‌గ‌దీశ్  ,ప్లాన్ బి, శుక్ర‌, త‌లైవి, మా ఊరి ప్రేమ‌క‌థ‌, రేడియోమాధ‌వ్, మంచి రోజు చూసి చెప్తా, విజ‌య్ రాఘ‌వన్, సిండ్రిల్లా సినిమాలు విడుద‌ల‌కు రెడీగా ఉన్నాయి. ఎప్రిల్ 30న విరాట‌ప‌ర్వం, సీటీమార్ (కావ‌చ్చు), లాభం, సుంద‌రి, ఘ‌గ‌నం, వివాహ భోజ‌నంబు, వేయి శుభ‌ములు క‌లుగుగాక‌, బంటీ ఔర్ బ‌బ్లీ, ల‌వ్ యూ రా, ఢీ కంపెనీ సినిమాలు విడుద‌ల‌కు సిధ్ధంగా ఉన్నాయి. మ‌రి చూడాలి వీటిలో ఏ సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుందో. 

More Related Stories