సినీ రచయిత మీద కేస్.. నగ్న చిత్రాలు యూట్యూబ్  లో  Tollywood
2020-09-09 11:21:45

అతని పేరు రమణ, సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్ వచ్చాడు. నెమ్మదిగా టీవీ సీరియల్స్ కి డైలాగ్స్ రాయడం మొదలు పెట్టి రచయితగా మారాడు. బంజారా హిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో నివసించే ఓ యువతి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో తో పరిచయం అయ్యింది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. సినిమాలు వద్దని చెప్పడంతో సదరు యువతి ఆ ప్రయత్నాలు కూడా మానుకుంది. ఆ తర్వాత సోదరుడి తో కలిసి గల్ఫ్‌ వెళ్లింది. అక్కడ సంపాదించిన దాంట్లో రూ.2.5 లక్షలు ఖర్చుపెట్టి ప్రియుడికి ఉంగరం, వాచీ, ఐఫోన్‌ కొనిపెట్టింది. పెళ్లి ప్రస్తావన తేవడంతో గౌతమ్‌ అడ్డం తిరిగాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటన అనంతరం పోలీసులు గౌతమ్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పెళ్లికి అంగీకరించడంతో అప్పట్లో హరే కృష్ణకృష్ణ దేవాలయంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. వివాహం అనంతరం ఎన్‌బీటీ నగర్‌లోని యువతి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి సిగరెట్ కోసం బయటకు వెళ్లిన గౌతమ్‌ తిరిగి ఇంటికి రాలేదు. అలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఏడాది క్రితం సంచలనం రేపింది. ఇప్పుడు తన భార్య నగ్న చిత్రాలు యూ ట్యూబ్ లో పెడతానని బెదిరింపులకు దిగినట్టు పోలీసులకి ఫిర్యాదు చేశారు. భార్యకు ఫోన్ చేసి కేస్ వాపసు తీసుకోకుంటే నగ్న చిత్రాలు యూ ట్యూబ్ లో పెడుతూ అంటూ బెదిరిస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

More Related Stories