టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు



Sai Balaji
2021-04-26 17:17:49

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య తో పాటు మరణాల సంఖ్య కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే పలువురు సినిమా తారలు కరోనా బారిన పడ్డారు. కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటుండగా..మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంతే కాకుండా మహమ్మారి ఇప్పటివరకు కొంతమంది నటీ నటులను సైతం పొట్టన పెట్టుకుంది.

కాగా తాజాగా కరోనా ఇండస్ట్రీలో మరో విషాదాన్ని మిగిల్చింది. ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి బాలాజీ కరోనా తో కన్ను మూశారు. సాయి బాలాజీ కరోనా తో కొన్ని రోజులనుండి గచ్చి బౌలి టైమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడం తో సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. బాలాజీ.. శ్రీహరితో శివాజీ, ఒరేయ్ తమ్ముడు సినిమాలను తెరకెక్కించారు.  చిరంజీవి బావగారూ బాగున్నారాతో పాటు వెంకటేష్, రాజశేఖర్ లాంటి హీరోల సినిమాలకు కూడా ఈయన స్క్రీన్ ప్లే అందించాడు.

More Related Stories