ఏప్రిల్ నెల మీద దండెత్తిన టాలీవుడ్love story
2020-02-18 16:36:37

టాలీవుడ్ మూవీ మేకర్స్ ఎంతో ద్రుష్టి పెట్టే సీజన్ సంక్రాంతి. సినిమా చిన్నదయినా పెద్దదయినా సంక్రాంతికి రిలీజ్ చేస్తే మంచిదనే భావనలో ఉంటారు మన వాళ్ళు. ఆ సంక్రాంతి తర్వాత ఎక్కువ ద్రుష్టి పెట్టేది మాత్రం సమ్మర్ సీజన్ మీదే. పిల్లల సెలవలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా సమ్మర్ మీద కూడా ఫోకస్ పెడుతుంటారు మేకర్స్. అయితే ఈ ఏడాది సమ్మర్ కి పెద్ద హీరోల సినిమాలు ఏవీ రావడం లేదు. అందుకే మీడియం బడ్జెట్ సినిమాలు అలాగే చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్దం అవుతున్నాయి. 

ముఖ్యంగా ఏప్రిల్ నెలలోనే ఈ సారి తమ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ నెల రెండవ తారీఖు నుండే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏకంగా రెండవ తారిఖున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ రిలీజ్ కానుంది. అలాగే అనుష్క నటిస్తున్న థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం జనవరి 31 నుండి వాయిదా పడి అదే రోజున విడుదలవుతోంది. అలాగే రానా నటించిన లేటెస్ట్ ఫారెస్ట్ కాన్సెప్ట్ సినిమా అరణ్య కూడా పాన్ ఇండియా లెవల్లో అదే రోజున రిలీజ్ అవుతోంది. 

ఇక మెగా కాంపౌండ్ నుంచి లాంచ్ అవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కూడా అదే రోజున విడుదలవుతోంది. ఒక లైలా కోసం ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న ఒరేయ్ బుజ్జిగా చిత్రం కూడా ఏప్రిల్ 3న విడుదలకాబోతుంది. ఇక సెకండ్ వీక్ విషయానికి వస్తే హీరో రామ్, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతున్న హాట్రిక్ మూవీ రెడ్ రిలీజ్ 9న కానుంది. 

అదే రోజున తమిళ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ మూవీ వస్తోంది. ఇక తెలుగు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించే బాండ్ మూవీ కూడా ఏప్రిల్ 8న రాబోతుంది. ఇక మొదటి సినిమాతో తనదైన ముద్ర వేసుకున్న వెంకటేష్ మహా రూపొందించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఇక శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీకారం మూడో వారం అంటే ఏప్రిల్ 24న విడుదలకాబోతుంది. మొత్తానికి చాలా మంది హీరోలు ఆ నెలలో వారి వారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. 

More Related Stories